: గాంధీభవన్ కు కాకా భౌతికకాయం
కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు వెంకటస్వామి (85) అంత్యక్రియలను ఈ మధ్యాహ్నం 2 గంటలకు పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. దానికి ముందు, కాకా గౌరవార్థం ఆయన భౌతికకాయాన్ని కొంతసేపు గాంధీభవన్ లో ఉంచుతారు. అక్కడ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కాకా భౌతికకాయానికి నివాళి అర్పిస్తారు. అనంతరం ఊరేగింపుగా పంజాగుట్ట శ్మశానవాటికకు తరలిస్తారు. చంద్రబాబు, కేసీఆర్, జగన్, చిరంజీవి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తదితరులు కాకాకు నివాళి అర్పించారు.