: సత్యం కేసులో తుది తీర్పు వాయిదా
సత్యం కేసులో తుది తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. తుది తీర్పును మార్చి 9న వెల్లడించనున్నట్లు ప్రత్యేక కోర్టు తెలిపింది. ఈ కేసులో నేడు తీర్పు వెలువడుతుందనే క్రమంలో... స్థానిక మీడియాతో పాటు జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్దఎత్తున నాంపల్లి సీబీఐ కోర్టుకు వెళ్లారు. కోర్టు ప్రారంభమైయ్యే సమయానికి బైర్రాజు రామలింగరాజు సహా ఇతర నిందితులు కోర్టుకు వచ్చారు. రాజుతో పాటు నిందితులుగా ఉన్న ఆయన సోదరుడు రామరాజు, వడ్లమాని శ్రీనివాస్, ఎస్.గోపాలకృష్ణన్, తళ్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణ రాజు తదితరులు కోర్టుకు హాజరయ్యారు. కాగా, ఈడీ పెట్టిన కేసులో రామలింగరాజు తదితరులకు విధించిన శిక్షను తాత్కాలికంగా నిలుపుతున్నట్టు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.