: పెద్ద దిక్కును కోల్పోయాం: కాకా మృతిపై నాయిని నర్సింహారెడ్డి
బడుగు బలహీన వర్గాలకు పెద్ద దిక్కుగా ఉన్న వెంకటస్వామి మృతి తమకు తీరని లోటని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ తో కలిసి నాయిని, ఇతర మంత్రులు కాకా నివాసానికి వెళ్లి, ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం కాకా సేవలను నాయిని నర్సింహారెడ్డి కొనియాడారు. కార్మిక నేతగా ప్రస్థానం ప్రారంభించిన కాకా, ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు కీలక పదవులు అలంకరించారన్నారు. కాకా మృతితో తెలంగాణ పెద్ద దిక్కును కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, కాకా భౌతిక కాయానికి వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తదితరులు నివాళులర్పించారు.