: మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ సెగలు పుట్టిస్తున్న కాశ్మీరం


మైనస్ డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలతో గడ్డకట్టిన జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల ఫలితాల సరళి వేడి పుట్టిస్తోంది. బీజేపీ, పీడీపీల మధ్య ఆధిక్యత నువ్వా? నేనా? అన్నట్టు కొనసాగుతోంది. మొత్తం 87 స్థానాలకు గానూ చెరో 24 స్థానాల్లో బీజేపీ, పీడీపీ ఆధిక్యంలో ఉన్నాయి. 17 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, 15 స్థానాల్లో కాంగ్రెస్, 7 స్థానాల్లో ఇతరులు లీడ్ లో ఉన్నారు. 44 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసే పార్టీ అధికారాన్ని చేపడుతుంది. ఏ పార్టీకీ 44 స్థానాలు రాకపోతే... హంగ్ ఏర్పడుతుంది. దీంతో, చల్లటి కాశ్మీరంలో ఉత్కంఠభరితమైన ఫలితాల సరళి సెగలు పుట్టిస్తోంది.

  • Loading...

More Telugu News