: సయీద్ పేరు చివర 'సాహిబ్' తొలగింపు... భారత్ కు యూఎన్ సారీ


ముంబై మారణహోమం సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ను 'సాహిబ్'గా పేర్కొన్నందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి క్షమాపణలు చెప్పింది. భద్రతామండలికి చెందిన ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ గత డిసెంబరు 17న విడుదల చేసిన ఓ లేఖలో సయీద్ ను సాహిబ్ గా పేర్కొంది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వందలాది మంది మరణానికి కారణమైన వ్యక్తిని, ఐక్యరాజ్య సమితి సైతం ఉగ్రవాదిగా గుర్తించిన వ్యక్తిని సాహిబ్ గా ఎలా గౌరవిస్తారని మండిపడింది. దీంతో, ఆంక్షల కమిటీ సాహిబ్ అన్న పదాన్ని తొలగించి... క్షమాపణలు చెప్పింది.

  • Loading...

More Telugu News