: 'పీకే' సినిమా అద్భుతంగా ఉంది: కేజ్రీవాల్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన 'పీకే' సినిమా అద్భుతంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. ఢిల్లీలోని షహీబాబాద్ లో సినిమా చూసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, నిజంగా 'పీకే' సినిమా అద్భుతమైన సినిమా అని అన్నారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీలను ఆయన అభినందించారు. కాగా ఆయన చాలా కాలం విరామం తరువాత సినిమా చూసి ఆనందించారు.