: రేపే జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ ఓట్ల లెక్కింపు
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రేపే ఓట్ల లెక్కింపు జరుగనుంది. జమ్మూకాశ్మీర్ లోని జిల్లా కేంద్రాల్లో 28 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఎన్నిక అధికారి తెలిపారు. కాశ్మీరీ శరణార్ధుల ఓట్లు జమ్మూ, ఢిల్లీ, ఉదంపూర్ లలో లెక్కించనున్నారు. జమ్మూకాశ్మీర్ లో ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 5 వేల మంది సిబ్బందిని వినియోగించనున్నారు. జార్ఖండ్ లో కూడా ఓట్ల లెక్కింపు కోసం మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, రెండు రాష్ట్రాల్లోనూ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కించనున్నారు.