: వాజ్ పేయీ పుట్టిన రోజు సుపరిపాలన కార్యక్రమాలు: పీఎంవో
మాజీ ప్రధాని వాజ్ పేయీ పుట్టినరోజున సుపరిపాలన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాన మంత్రి కార్యాలయం మంత్రులకు సూచించింది. మంత్రులు, ఎంపీలు డిసెంబర్ 25న సుపరిపాలన కార్యక్రమాలు చేపట్టాలని, ఈ- గవర్నెన్స్ శిబిరాలు, డిజిటల్ అక్షరాస్యతపై ప్రచారం చేయాలని పీఎంవో తెలిపింది. కాగా, మాజీ ప్రధాని వాజ్ పేయీ పుట్టిన రోజును సుపరిపాలన దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశానికి విశిష్ట సేవలందించిన మాజీ ప్రధానికి భారతరత్న పురస్కారం కూడా ప్రకటించే అవకాశం ఉంది.