: వంద కోట్లకు చేరువలో 'పీకే'


నటుడు అమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రం వంద కోట్ల మార్కుకు చేరువవుతోంది. ఈ నెల 19న విడుదలైన ఈ చిత్రం మూడు రోజులకుగానూ రూ.92.5 కోట్లు వసూలు చేసింది. రచయిత మిలాప్ ఝవేరీ ట్విట్టర్ లో తెలిపిన సమాచారం ప్రకారం, "ఈ ఆదివారం నాడు 'పీకే' దాదాపు రూ.37 కోట్లు వసూలు చేసింది. తొలి రోజు నుంచే ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది" అని పేర్కొన్నారు. మొదటి రోజు రూ.26 కోట్లు, రెండవ రోజు రూ. 29 కోట్లు వసూలు చేసింది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్క శర్మ కథానాయిక.

  • Loading...

More Telugu News