: కాకా పరిస్థితి విషమం


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి.వెంకటస్వామి (కాకా) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ కేర్ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నేటి మధ్యాహ్నం కేర్ ఆసుపత్రి డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. గత కొంతకాలంగా కాకా అనారోగ్యంతో బాధపడుతూ, నగరంలోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్‌ విభాగానికి తరలించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News