: సభలో ఎవరు అమర్యాదగా మాట్లాడినా తప్పే: కోడెల
శాసనసభలో ఎవరు అమర్యాదగా మాట్లాడినా తప్పేనని స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నాలుగు గంటలకు ప్రారంభమైన అనంతరం గోరంట్ల చేసిన వ్యాఖ్యలపై రోజా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా కోడెల మాట్లాడుతూ, సభలో జరిగిన విషయం రికార్డుల్లో భద్రంగా ఉంటుందని, ఐదుగురు సభ్యుల కమిటీ వేస్తానని, ఆ రికార్డులు పరిశీలించిన కమిటీ ఏది సూచిస్తే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. శాసనసభ్యుల మాటలు సభను కించపరిచేలా ఉన్నాయని, అలా ఉండకూడదని అన్నారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, స్పీకర్ సభను గమనించకుండానే నడుపుతున్నారా? అంటూ వైఎస్సార్సీపీ విమర్శించింది. స్పీకర్ పక్షపాతం కారణంగా సభ దిగజారుతోందని ఆ పార్టీ ఆరోపించింది.