: టీడీపీ కార్యాలయంలోకి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు... గుంటూరులో ఉద్రిక్తత!
ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కొద్దిసేపటి క్రితం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. కార్యాలయంలోకి వెళ్లిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు లోపలి నుంచి తలుపులేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యాలయం లోపల ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఏ అఘాయిత్యానికి పాల్పడతారోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయం లోపలికి వెళ్లిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను బయటకు రప్పించేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారు. వర్గీకరణను డిమాండ్ చేస్తూ ఆదివారం కూడా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు గుంటూరు టీడీపీ కార్యాలయం ఎదుట ఆందోళన కొనసాగించిన సంగతి తెలిసిందే.