: కేరళలో కేఎఫ్ సీ, మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్స్ పై మావోల దాడి


మావోయిస్టులు కేరళలో తమ కార్యకలాపాలను తీవ్రతరం చేశారు. వరుసగా మూడుసార్లు పాలక్కడ్, వాయనాద్ జిల్లాల్లో ఈ తెల్లవారు జామున దాడులు చేశారు. 15 మంది సభ్యులున్న ఓ బృందం ఇక్కడి అటవీ కార్యాలయంపై దాడి చేసి, ఫైళ్లను తగలబెట్టింది. అంతేగాక కంప్యూటర్లు, ఫర్నీచర్లను ధ్వంసం చేశారు. కార్యాలయం ముందు నిలిపిన అటవీ శాఖ వాహనాన్ని దగ్ధం చేశారు. స్థానిక గిరిజనుల విషాదకరమైన పరిస్థితికి ప్రభుత్వమే కారణమంటూ ఆఫీసు ప్రాంగణంలో గోడలపై పోస్టర్లు అంటించి, వారిని పట్టించుకోవాలని మావోలు కోరారు. ఏడుగురు సభ్యులున్న మరో బృందం పాలక్కడ్ పట్టణంలోని కేఎఫ్ సీ, మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్స్ పై ఉదయం ఏడు గంటల సమయంలో దాడి చేశారు.

  • Loading...

More Telugu News