: సభలో గందరగోళం... పది నిమిషాల పాటు సభ వాయిదా
ఏపీ శాసన సభలో విపక్షం ఆందోళన నేపథ్యంలో సమావేశాలు పది నిమిషాల పాటు వాయిదా పడ్డాయి. వైకాపా సభ్యుడు భూమా నాగిరెడ్డి ప్రవేశపెట్టిన సభాహక్కుల తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీంతో తమ వాదనలు వినాలంటూ వైకాపా సభ్యులు డిమాండ్ చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు. నేడు సభ ప్రారంభం కాగానే కాంట్రాక్టు ఉద్యోగులపై సర్కారు తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసిన విపక్షం కొద్దిసేపటికే సభలోకొచ్చి సభాహక్కుల తీర్మానాన్ని ప్రతిపాదించింది.