: రాజధానికి ఎన్టీఆర్ పేరుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: యనమల


నవ్యాంధ్ర కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏపీ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటన చేశారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి, రాజధాని పేరుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. నవ్యాంధ్ర రాజధానికి దివంగత నేత ఎన్టీ రామారావు పేరు పెట్టాలన్న డిమాండ్లు పలు వర్గాల నుంచి వినిపిస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రాజధాని పేరుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News