: హుదూద్ తుపానుకు తానా విరాళం రూ.2 కోట్లు
ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ తుపాను ఉపద్రవం నుంచి కోలుకునేందుకు ఏపీకి 'తానా' (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఆదివారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని ఈ మేరకు విరాళాన్ని ప్రకటించారు. తెలుగు ప్రజల అభ్యున్నతికి తానా తన వంతు కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ విశాఖపట్నంలో నిర్వహించిన విశాఖ ఉత్సవ్ తరహాలో విజయవాడలోనూ కృష్ణ ఉత్సవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.