: బ్రాహ్మణులకు బాబు కానుక .. 'ఆయుష్మాన్ భవ'
విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేత చంద్రబాబు నాయుడు బ్రాహ్మణులపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే నిరుపేద బ్రాహ్మణుల కోసం రూ. 500 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలోని చంద్రయ్య పాలెం వద్ద ఆయన మాట్లాడుతూ, 60 ఏళ్ళు పైబడిన బ్రాహ్మణులకు నెలకు రూ. 1000 వంతున పింఛన్ అందజేస్తామన్నారు. ఈ పథకానికి 'ఆయుష్మాన్ భవ' అని నామకరణం చేశారు.
అంతేగాకుండా ప్రతి ఊళ్ళోనూ వేద విజ్ఞాన భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 30 ఏళ్ళు నిండిన బ్రాహ్మణులకు ఇంటి నిర్మాణం కోసం లక్షా యాభై వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తామని బాబు చెప్పారు.