: దేశీయ గోసంతతి పరిరక్షణకు కృషి: మంత్రి మాణిక్యాలరావు


దేశంలో గోవుల సంతతిని పెంపొందించేందుకు చర్యలు చేపడతామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రకటించారు. నేడు తిరుపతిలో వెంకటేశ్వర గోశాల నిర్వాహకుల సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవులను కబేళాలకు తరలించడాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నామన్నారు. గోసంతతి పరిరక్షణలో భాగంగా వెంకటేశ్వర గోశాలలో 10 వేల గోవులను సంరక్షించేందుకు చర్యలు తీసుకోనున్నామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News