: ఏపీ ఎన్జీవో హౌసింగ్ సొసైటీని రద్దు చేయాలి: తెలంగాణ ఎన్జీవో


ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ సొసైటీని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఎన్జీవో సంఘం డిమాండ్ చేసింది. హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలకు కారకులైన దోషులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతోంది. సొసైటీకి చెందిన సభ్యుల సొమ్ము రూ.18 కోట్లు కాజేసిన గోపాల్ రెడ్డి, చంద్రశేఖర్, అశోక్ బాబులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అంతేగాక వారి నుంచి సొమ్మును రికవరీ చేసి బాధితులకు చెల్లించాలని సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ కోరారు. ఇక తమ డిమాండ్లపై ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు కాలయాపన చేస్తున్నారన్నారు. నెలాఖరులోగా డిమాండ్లకు సానుకూల నిర్ణయం తీసుకోకపోతే కార్యాలయానికి తాళం వేసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News