: అయ్యప్ప భక్తులకు ఇచ్చిన ఆహారంలో చచ్చిన ఎలుకలు... రైల్వే శాఖ నిర్లక్ష్యం
ప్రయాణికులకు ఆహారాన్ని సరఫరా చేసే విషయంలో రైల్వే శాఖ ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందో తెలిపే మరో ఉదాహరణ ఇది. కన్యాకుమారి నుంచి హజ్రత్ నిజాముద్దీన్ కు వెళ్ళే తిరుక్కురళ్ ఎక్స్ ప్రెస్ రైలులో విజయవాడకు సుమారు 500 మంది అయ్యప్ప భక్తులు వస్తున్నారు. వీరికి నేటి మధ్యాహ్నం సరఫరా చేసిన ఆహారంలో చచ్చిన ఎలుకలు కనిపించాయి. రైలులోని బీ-2 కోచ్ లో ఆహార పొట్లాలు విప్పి చూసిన భక్తులు అందులో ఎలుకలను చూసి ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.