: హుదూద్ సహాయార్థం రజనీకాంత్ రూ.5 లక్షల విరాళం


ఆంధ్రప్రదేశ్ హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం నటుడు రజనీకాంత్ విరాళం అందజేశారు. ఈ మేరకు ఏపీ సీఎం సహాయనిధికి రూ.5 లక్షల చెక్కును పంపించారు. తను నిర్వహిస్తున్న శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్టు తరపున విరాళం అందించారు. హుదూద్ బాధితుల కోసం తెలుగు చిత్ర పరిశ్రమ నిర్వహించిన 'మేము సైతం' కార్యక్రమానికి హాజరుకాలేకపోయానని హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన లింగా సక్సెస్ మీట్ లో రజనీ అన్నారు. త్వరలోనే తన వంతు విరాళం అందిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News