: త్వరలోనే పెళ్లి చేసుకుంటా: సల్మాన్ ఖాన్


బాలీవుడ్ లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'గా గుర్తింపున్న నటుడు సల్మాన్ ఖాన్ 2015లో వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఖాన్ల త్రయం సల్మాన్, అమీర్, షారూక్ లు కలసి నటించే చిత్రం ప్రారంభమయ్యేలోగా పెళ్లి పీటలు ఎక్కుతానని సల్మాన్ వెల్లడించాడు. ముంబైలో జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తనను అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ, "ముగ్గురు ఖాన్లు కలసి సినిమా చేసే ముందే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా" అన్నాడు. కాగా, సల్మాన్ తదుపరి చిత్రం 'బజ్ రంగీ భాయి జాన్' జూలై 17న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News