: ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ గా అలిస్టర్ కుక్ కు ఉద్వాసన... మోర్గాన్ కు బాధ్యతలు


విశ్లేషకులు ఊహించినట్టుగానే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి అలిస్టర్ కుక్ ను తప్పిస్తున్నట్టు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. త్వరలో జరగనున్న వన్ డే క్రికెట్ వరల్డ్ కప్ పోటీలకు ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహిస్తారని తెలిపింది. గత కొంతకాలంగా ఫాం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కుక్, గత 22 ఇన్నింగ్సులలో కేవలం ఒక సెంచరీ మాత్రమే చేశాడు. ఆయన నేతృత్వంలో ఇంగ్లాండ్ ఆడిన చివరి 6 సిరీస్ లలో 5 సిరీస్ లలో ఓడిపోయింది. కుక్ కెప్టెన్సీలో 69 మ్యాచ్ లు ఆడిన ఇంగ్లాండ్ 36 మ్యాచ్ లలో గెలిచింది.

  • Loading...

More Telugu News