: గాడ్సే విగ్రహం పెట్టాలనుకుంటున్న హిందూ మహాసభ నిర్ణయంపై వ్యతిరేకత


జాతిపిత మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే విగ్రహాన్ని దేశ రాజధాని ఢిల్లీలో పెట్టాలని అఖిల భారతీయ హిందూ మహాసభ ఆలోచన చేస్తోంది. ఇందుకోసం ఢిల్లీలో స్థలం కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై లోక్ సభలో కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని కూడా కోరారు. దీనిపై కాంగ్రెస్ నేత కె.రహమాన్ ఖాన్ మాట్లాడుతూ, "ఈ అంశంపై ప్రభుత్వం, ప్రధానమంత్రి మౌనంగా ఉన్నారు. ఈ వ్యవహారంలో వారి వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని జాతి కోరుకుంటోంది. వారు గాడ్సే జీవితాన్ని పొగిడి, జయంతిని జరుపుకున్నారు. ఇప్పుడు విగ్రహం పెట్టాలని మాట్లాడుతున్నారు. కానీ ప్రధానమంత్రి ఏమీ చెప్పడం లేదు" అని అన్నారు. ఇదిలా ఉంటే, ఆ ప్రకటన బీజేపీ వాస్తవ రూపాన్ని తెలుపుతోందని, భవిష్యత్తులో పార్లమెంటులోని ప్రముఖుల విగ్రహాల పక్కన గాడ్సే విగ్రహం పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News