: వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల మధ్యే పోటీ... వైకాపా ఔట్: కావూరి
రానున్న ఎన్నికల నాటికి ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్యే పోటీ ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావు అన్నారు. అప్పటికి వైఎస్సీర్సీపీ కనుమరుగు అయిపోతుందని జోస్యం చెప్పారు. టీడీపీకి భాగస్వామిగా ఉన్న బీజేపీ ప్రస్తుతానికి బలహీనంగా ఉన్నప్పటికీ... భవిష్యత్తులో బలపడుతుందని తెలిపారు. ఉత్తర భారతంలో పూర్తి ఆధిపత్యం కనబరుస్తున్న బీజేపీ... దక్షిణాదిలోనూ సత్తా చాటుతుందని కావూరి చెప్పారు. రానున్న రోజుల్లో దేశం మెత్తంమ్మీద బలమైన సింగిల్ పార్టీగా బీజేపీ అవతరిస్తుందని వెల్లడించారు. కావూరి మాటలను బట్టి చూస్తే.... 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి, బీజేపీకి మధ్య పొత్తు ఉండదేమోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి.