: నేరం రుజువైతే రేవంత్ రెడ్డికి మూడేళ్ళ వరకు జైలు శిక్ష!
తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 504, 505 కింద చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో రేవంత్ దోషిగా తేలితే మూడేళ్ళ వరకూ జైలు శిక్ష పడే అవకాశముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు సమన్లు జారీ చేయాల్సిందిగా నిన్న మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చార్జ్ షీట్ దాఖలు చేశారు.