: ఈసారి రాజకీయనేతల పిల్లలను చంపుతారట!
పాకిస్థాన్ లో తెహ్రీక్-ఏ-తాలిబన్ మిలిటెంట్ గ్రూపు దురాగతాలకు అడ్డులేకుండా పోతోంది. కొన్ని రోజుల క్రితం పెషావర్లో సైనిక పాఠశాలపై దాడి చేసి 132 మంది చిన్నారులను పొట్టనబెట్టుకున్న తాలిబన్లు మరిన్ని దాడులకు తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అయితే, ఈసారి రాజకీయనేతల సంతానాన్ని చంపేస్తామంటూ ప్రకటించారు. ఈ మేరకు తాలిబన్ల అగ్రనాయకత్వం నుంచి ఓ లేఖ వెలువడింది. దాంట్లో ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఉద్దేశించి హెచ్చరికలు చేశారు. ఆయన కుటుంబంలోని పిల్లలను కూడా చంపుతామని స్పష్టం చేశారు. కాగా, పెషావర్లో తాము ఎందుకు దాడికి పాల్పడాల్సి వచ్చిందో ఆ లేఖలో తెలిపారు. సైనిక పాఠశాలలో చేరడం ద్వారా ఆ విద్యార్థులు వారి తల్లిదండ్రుల బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నారని, అందుకే వారిని చంపేశామని పేర్కొన్నారు.