: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ క్వార్టర్స్ లో పట్టపగలు దారుణం


తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. యూనివర్సిటీ క్వార్టర్స్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వర్సిటీ ఏఏఓ శివశంకర్ భార్య సుధారాణి (48)ని హత్యచేసి, ఆమె వద్ద ఉన్న నగలను దోచుకెళ్లిపోయారు. ఏఏఓగా విధులు నిర్వర్తిస్తున్న శివశంకర్ క్వార్టర్స్ లోనే నివాసం ఉంటున్నారు. కాగా, దొంగలు పట్టపగలు ఆమెపై దాడి చేసి, ఆమె గొంతు కోసి నగలు దోచుకెళ్లిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది దోపిడీ దొంగలపనే అని అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం వివరాలు సేకరిస్తోంది. రెండేళ్ల క్రితం ఇదే క్వార్టర్స్ లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకోగా, అక్కడ పని చేస్తున్న సిబ్బందే దారుణానికి ఒడిగట్టారని దర్యాప్తులో బయటపడింది. ఈ దారుణం ఇప్పుడెలా చోటుచేసుకుందో దర్యాప్తులో తేలనుంది.

  • Loading...

More Telugu News