: 'సిడ్నీ కేఫ్' ఘటనను మించిన ఘోరం... ఒకే ఇంట్లో 8 మంది చిన్నారుల మృతదేహాలు


ఆస్ట్రేలియాలోని కెయిర్న్స్ పట్టణంలో ఒక ఇంట్లో 8 మంది చిన్నారుల మృతదేహాలు కనిపించడం సంచలనం సృష్టించింది. సిడ్నీ కేఫ్ ఘటన నుంచి తేరుకోకముందే ఆస్ట్రేలియాను మరోసారి ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి. సౌత్ క్వీన్స్‌ లాండ్‌ లోని కెయిర్న్స్ పట్టణంలోని ఓ ఇంటి ఆవరణలో మహిళ గాయపడి ఉన్నట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించిన అనంతరం ఆ ఇంట్లోకి వెళ్ళిన పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. కారణం, అక్కడ ఎనిమిది మంది పిల్లల మృతదేహాలు కనిపించడమే. వీరి వయసు 18 నెలల నుంచి 15 ఏళ్ల వరకూ ఉంటుందని సమాచారం. పిల్లలపై పదునైన ఆయుధంతో దాడి జరిగినట్లు గాయాలను బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దాడికి కారణం ఇంకా తెలియలేదని పేర్కొన్నారు. ఆ పిల్లలందరూ తోబుట్టువులేనని తెలుస్తోంది. ఈ దుర్ఘటన గుండెల్ని పిండేసే దారుణమని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ అన్నారు. పిల్లల తల్లిదండ్రులకే కాకుండా, ఎవరికీ మింగుడుపడని వాస్తవమని, మొత్తం దేశానికే ఇది పరీక్షా కాలమని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News