: పీ.వీ.నరసింహారావును తలచుకున్న చంద్రబాబు


భారత న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విశాఖలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి హాజరై ఆయన ప్రసంగించారు. ప్రతి న్యాయవాదికి సామాజిక బాధ్యత ఉండాలని, దేశంలో నాణ్యమైన న్యాయ విద్యకు మంచి డిమాండ్ ఉందని అన్నారు. విశ్వవిద్యాలయానికి 50 ఎకరాల భూమి, రూ.25 కోట్ల నిధులను మంజూరు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News