: ఐదేళ్లలో ఐటీ ఎగుమతుల్లో ఏపీ టాప్: ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి


రానున్న ఐదేళ్లలో ఐటీ ఎగుమతులకు సంబంధించి దేశంలోనే అగ్రస్థానానికి ఆంధ్రప్రదేశ్ ఎగబాకనుందని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. నేటి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రంలో ఊహించని రీతిలో వృద్ధి నమోదు కానుందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.65 వేల కోట్ల మేర ఉండగా, విభజన తర్వాత ఏపీలో ఐటీ ఎగుమతులు రూ.1,700 కోట్లుగా ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళుతోందని ప్రకటించారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ఐటీఐఆర్ ప్రాజెక్టును చేపట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News