: మాజీ సీఎం కిరణ్ సొంత మండలంలో లంచావతారం
ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంత మండలం కలికిరిలో లంచావతారాన్ని అవినీతి నిరోధక శాఖాధికారులు అరెస్ట్ చేశారు. చిత్తూరులోని కలికిరి మండలంలో నేడు దాడులు చేసిన ఏసీబీ అధికారులు తహశీల్దార్ కార్యాలయంలో రూ.2 వేలు లంచం తీసుకుంటున్న వీఆర్ఓ రమేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. మొన్నటికి మొన్న కిరణ్ అనుచరులు ఎంపీడీఓ కార్యాలయంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదన్న కారణంగా ఎంపీడీఓను బెదిరించిన కిరణ్ అనుచరులు, కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని ఎంపీడీఓకు హుకుం జారీ చేశారు. తాజాగా లంచావతారం అరెస్ట్ తో మరోమారు కిరణ్ సొంత మండలం వార్తల్లోకెక్కింది.