: శరద్‌ పవార్ ఆరోగ్యం క్షేమం... ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్


ఇంట్లో జారిపడి కాలి గాయంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మాజీ కేంద్ర మంత్రి, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్ నేడు డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలోని తన నివాసంలో పవార్ 5వ తేదీన గాయపడిన సంగతి తెలిసిందే. ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చగా, వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయన ఆరోగ్యం కుదుట పడిందని, అందువల్లే డిశ్చార్జ్ చేశామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News