: గుడిసెల్లోనైనా సీమాంధ్ర నుంచే పాలన: చంద్రబాబు


రాష్ట్ర పాలన క్షేత్రంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాత్కాలిక షెడ్ల(గుడిసెలు)లోనైనా సీమాంధ్ర నుంచే పరిపాలన సాగిస్తామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్... పొలిటికల్ రాజధాని మాత్రమేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఏప్రిల్ నుంచి సీమాంధ్ర ప్రాంతం నుంచే పూర్తి స్థాయి పాలనను సాగించనున్నట్లు ఆయన తేల్చిచెప్పారు. నేటి అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడ్డ తర్వాత జరిగిన టీడీఎల్పీ భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఏర్పాటు కానున్న ప్రదేశాన్ని ఎంపిక చేసిన నేపథ్యంలో తుళ్లూరులో నిర్మాణాలను ఇకపై వేగవంతం చేయనున్నట్లు ఆయన చెప్పకనే చెప్పారు. నిత్యం తెలంగాణ సీఎం, మంత్రులు చేస్తున్న ఉద్రేకపూరిత వ్యాఖ్యల నేపథ్యంలోనే చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News