: జిల్లా కేంద్రం కోసం ఇనుపచువ్వలపై పడుకొన్నాడు!


మెదక్ పట్టణానికి చెందిన గోవిందరాజ్ అనే వ్యక్తి ఇనుపచువ్వలపై పడుకొని తెలిపిన నిరసన అందరినీ ఆందోళనకు గురిచేసింది. మెదక్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ అతడు 6 గంటలపాటు చువ్వలపై పడుకొన్నాడు. ఈ వినూత్న నిరసనను చూసేందుకు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ ఉద్యమం సాగిన సమయంలోనూ గోవిందరాజ్ ఇదే రీతిలో నిరసన తెలిపాడు. కాగా, మెదక్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ గత 77 రోజులుగా రిలే నిరహార దీక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, గోవిందరాజ్ నిరసన ప్రాధాన్యత సంతరించుకుంది. మెదక్ జిల్లాకు సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉంది.

  • Loading...

More Telugu News