: వాతావరణం అనుకూలించక ముందే ముగిసిన ఆట
బ్రిస్బేన్ టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. వాతావరణం అనుకూలించకపోవడంతో నిర్ణీత సమయానికి ముందే ఆట నిలిపివేశారు. అప్పటికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (408) కు కంగారూలు ఇంకా 187 పరుగులు వెనకబడి ఉన్నారు. చేతిలో 6 వికెట్లున్నాయి. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 65, మిచెల్ మార్ష్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ ఒక వికెట్ తీశాడు.