: జనవరిలో ఎయిమ్స్ కు శంకుస్థాపన: కామినేని


అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు జనవరిలో శంకుస్థాపన చేస్తామని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఏపీకి కేంద్రం ఎయిమ్స్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిమ్స్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో స్థలం అందుబాటులో ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ఈ నేపథ్యంలో సదరు స్థలాన్ని పరిశీలించడంతో పాటు ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేందుకు రేపు విజయవాడకు కేంద్ర బృందం రానుందని కామినేని వెల్లడించారు. కేంద్ర బృందం పరిశీలన తర్వాత ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించిన చర్యలను వేగవంతం చేయనున్నామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News