: ఎవరికి ఏ కష్టం వచ్చినా, తన కష్టంగా భావించే వ్యక్తి వెంకటరమణ: చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వెంకటరమణ మరణం తీరని లోటు అని అభిప్రాయపడ్డారు. కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నా, నవ్వుతూ ముందుకు వెళ్లే వ్యక్తి వెంకటరమణ అని పేర్కొన్నారు. ఆయన ఇద్దరు కుమార్తెలూ మూగవారని వెల్లడించారు. సహనానికి మారుపేరు వెంకటరమణ అని కీర్తించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించే వ్యక్తి అని, ఎవరికీ ఇబ్బంది కలిగించని వ్యక్తి అని తెలిపారు. 40 వేలకు పైగా మెజారిటీతో గెలిచాడంటే ఆయనకు ఎంత పాప్యులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు అని చంద్రబాబు చెప్పారు. సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత స్థానానికి ఎదిగారని తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్ గా కెరీర్ ఆరంభించి అంచెలంచెలుగా ఎదిగారని వివరించారు. చివరగా, ఆయన భార్యకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.