: చైనా స్టార్ కు షాకిచ్చిన సైనా
భారత సూపర్ షట్లర్ సైనా నెహ్వాల్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో చైనా స్టార్ షిజియాన్ వాంగ్ ను మట్టికరిపించింది. దుబాయ్ లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన మ్యాచ్ లో సైనా 21-17, 21-18తో వాంగ్ ను చిత్తు చేసింది. రెండుసార్లు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ వాంగ్ ఈ పోరులో సైనా ధాటికి నిలవలేకపోయింది. మాజీ వరల్డ్ నెంబర్ వన్ వాంగ్ గత ఐదు మ్యాచ్ లలో నాలుగు సార్లు సైనాపై నెగ్గింది. అయితే, గత రికార్డును పట్టించుకోని సైనా సామర్థ్యం మేరకు ఆడి చైనా క్రీడాకారిణికి షాకిచ్చింది.