: నేడు బాధ్యతలు చేపట్టనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకవర్గం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకవర్గం నేడు బాధ్యతలు స్వీకరించనుంది. చైర్మన్ గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నేటి ఉదయం 11 గంటల ప్రాంతంలో బాధ్యతలు చేపడతారు. ఆయనతో బాటు మరో ముగ్గురు సభ్యులు కూడా పదవీ స్వీకారం చేస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగ సంఘాల తరపున కీలక భూమిక పోషించిన విఠల్ కు కమిషన్ లో చోటు కల్పించారు. మొన్నటి ఎన్నికల్లోనే విఠల్ కు అసెంట్లీ టికెట్ దక్కుతుందని భావించినా, ఆ దిశగా అడుగు పడలేదు. అయితే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో స్థానం కల్పించడం ద్వారా కేసీఆర్, విఠల్ కు కీలక బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. ఇక, చంద్రావతి, మసీనుద్దీన్ ఖాద్రీలు కూడా కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు. దీంతో, తెలంగాణలో త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకోనుంది.