: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రఘువీరా లేఖ


ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి అనంతపురం జిల్లాకు సమాంతర కాల్వ ఏర్పాటు చేసేందుకు సహకరించాలని లేఖలో కోరారు. కరవు కాటకాలతో అనంతపురం జిల్లా అల్లాడుతోందని, తుంగభద్ర నీటిని జిల్లాకు వాడుకునేందుకు ముఖ్యమంత్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమాంతర కాల్వ నిర్మాణానికి ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. కాల్వ నిర్మాణం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపాలని కోరారు.

  • Loading...

More Telugu News