: రాజ్యసభ నుంచి సస్పెండైన వీహెచ్
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావును రాజ్యసభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. మత మార్పిడుల అంశంపై సభలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తున్న సమయంలో... నిరసనలో భాగంగా పోడియంలోకి వీహెచ్ వెళ్లారు. సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగించరాదని, వెళ్లి సీట్లో కూర్చోవాలని రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ హెచ్చరించినప్పటికీ వీహెచ్ వినలేదు. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన అన్సారీ... వీహెచ్ ను సభ నుంచి సస్పెండ్ చేశారు.