: నా కూతురుకి మంత్రి పదవి ఇస్తామని ప్రలోభపెట్టారు: భూమా నాగిరెడ్డి
ఆళ్లగడ్డ ఉపఎన్నికలో తన కూతురు అఖిలప్రియను టీడీపీ తరపున పోటీ చేయిస్తే... మంత్రి పదవిని కూడా ఇస్తామని టీడీపీ ప్రలోభపెట్టిందని వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. వారి ఆఫర్ ను తాను తిరస్కరించడంతో.. తనపై తప్పుడు కేసులు మోపారని ఆరోపించారు. మనుషులే శాశ్వతం కానప్పుడు... పదవులు ఎంత? అని వ్యాఖ్యానించారు. పదవి పోతే చంద్రబాబు కూడా మాజీ ముఖ్యమంత్రే అవుతారని అన్నారు. కేసులకు తాను భయపడే వ్యక్తిని కానని తెలిపారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన గొడవను, ఆ తర్వాత జరిగిన ఘటనలను తాను అసెంబ్లీలో లేవనెత్తుతానని చెప్పారు.