: లక్ష్మీనరసింహస్వామి సేవలో తెలంగాణ సీఎం కేసీఆర్


తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో యాదగిరిగుట్ట చేరుకున్న ఆయన గుట్ట అభివృద్ధిపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆలయంలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఆయన, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.100 కోట్లను కేటాయించిన ప్రభుత్వం, అవసరమైతే మరిన్ని నిధులను విడుదల చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News