: లాలూ కుమార్తె, ములాయం మనవడికి నిశ్చితార్థం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రాజ్యలక్ష్మి, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మనవడు, ఎంపీ తేజ్ ప్రతాప్ సింగ్ లకు నిశ్చితార్థం జరిగింది. దాంతో, అధికారికంగా లాలూ, ములాయంలు బంధువులయ్యారు. ఢిల్లీలో చట్టర్పూర్ లోని లాలూ కుటుంబానికి చెందిన ఫాంహౌస్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వారు, జేడీ(యు) వ్యవస్థాపకుడు నితీశ్ కుమార్, ఆ పార్టీ అధినేత శరద్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝి, ఆర్జేడీ ఎంపీలు, మరికొంతమంది సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగినట్టు లాలూ సహచరుడు పిసీ గుప్తా తెలిపారు. కాగా, వివాహం ఫిబ్రవరి 26న ఢిల్లీలో జరగనుంది.