: పాక్ విద్యార్థుల కోసం మౌనం పాటించిన భారత్ పాఠశాలలు


పాకిస్థాన్ లో తాలిబన్ల కిరాతకానికి బలైన వందలాది విద్యార్థుల ఆత్మశాంతి కోసం భారత్ లోని పాఠశాలలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించాయి. వడోదరలో ఓ విద్యార్థి మాట్లాడుతూ, అమాయకులైన విద్యార్థులను చంపేశారని, పెషావర్ ఘటన విని విషాదంలో మునిగిపోయామని తెలిపాడు. పెషావర్లో మంగళవారం నాడు మిలిటరీ దుస్తుల్లో వచ్చిన తాలిబన్లు ఓ సైనిక పాఠశాలలో చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో దాదాపు 151 మంది చనిపోవడం తెలిసిందే. వారిలో అత్యధికులు చిన్నారులే కావడంతో ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

  • Loading...

More Telugu News