: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా...క్రీజులోకొచ్చిన కోహ్లీ
బ్రిస్బేన్ లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో వికెట్ ను కోల్పోయింది. జట్టు స్కోరు సెంచరీ దాటి 101 పరుగులు చేరుకున్న తర్వాత ఫస్ట్ డౌన్ గా వచ్చిన ఛటేశ్వర్ పుజారా జోష్ హాజిల్ ఉడ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. బ్రాడ్ హాడిన్ కు క్యాచ్ ఇచ్చిన పుజారా వెనుదిరిగాడు. మొత్తం 64 బంతులు ఎదుర్కొన్న పుజారా కేవలం 18 పరుగులు మాత్రం చేయగలిగాడు. పుజారా పెవిలియన్ చేరడంతో విజయ్ కి జోడీగా టీమిండియా వైెస్ కెప్టెన్, భారత డాషింగ్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.