: కర్నూలు జిల్లాలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ దారుణ హత్య


కర్నూలు జిల్లాలో నేటి ఉదయం మరో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం కోడూరులో ఏపీఎస్పీ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. వెంకటేశ్వర్లును తల నరికి హత్య చేసిన దుండగులు మొండెం వదిలి తలను తీసుకెళ్లారు. ఏపీఎస్పీ తొమ్మిదో బెటాలియన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు ఈ నెల 12న అదృశ్యమయ్యాడు. సెలవుల కోసమని కర్నూలు వచ్చిన వెంకటేశ్వర్లు తిరిగి వెళుతున్న క్రమంలో అదృశ్యమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ హత్యకు పాల్పడిందెవరన్న విషయంపై పోలీసులకు చిన్న క్లూ కూడా లభించలేదని సమాచారం.

  • Loading...

More Telugu News