: రైల్వే పోలీసుల చేతిలో ప్రయాణికుడి మృతి...కర్నూలు జిల్లా డోన్ లో ఘటన


కర్నూలు జిల్లా ద్రోణాచలం (డోన్) రైల్వే స్టేషన్ లో దారుణం చోటుచేసుకుంది. టికెట్ లేదన్న కారణంతో 13 మంది ప్రయాణికులను రైల్వే పోలీసులు చితకబాదారు. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృత్యువాతపడ్డాడు. మృతి చెందిన ప్రయాణికుడిని కర్నూలుకు చెందిన వెంకటేశ్ గా గుర్తించారు. వలస కూలీగా జీవనం సాగిస్తున్న వెంకటేశ్ కర్నూలు నుంచి గుంటూరుకు వెళుతున్న క్రమంలో పోలీసుల చేతిలో మరణించాడు. సమాచారం అందుకున్న మృతుడి భార్య డోన్ రైల్వే స్టేషన్ చేరుకుని, పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగింది.

  • Loading...

More Telugu News