: మళ్లీ విఫలమైన ధావన్... 56 పరుగుల వద్ద తొలి వికెట్ డౌన్
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మరోమారు విఫలమయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 56 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. 39 బంతులను ఎదుర్కున్న ధావన్ 24 పరుగులు చేసి వెనుదిరిగాడు. మిచెల్ మార్స్ బౌలింగ్ లో బ్రాడ్ హాడిన్ క్యాచ్ పట్టడంతో ధావన్ పెవిలియన్ చేరాడు. అడిలైడ్ టెస్టులోనూ ధావన్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ విఫలమయ్యాడు. ధావన్ వెనుదిరగడంతో మురళీ విజయ్ కు ఛటేశ్వర్ పుజారా జతకలిశాడు.